ఆంధ్ర ప్రదేశ్

మన్యం జిల్లాలో ఘనంగా మెగా సంక్రాంతి వేడుకలు

పార్వతీపురం మన్యం జిల్లా కృష్ణ పల్లి గ్రామంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. ఐసీడీఎస్ శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసారు కలెక్టర్. సంప్రదాయ దుస్తులు ధరించి భోగి, సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు విద్యార్థులు. పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని.. చిన్న వయస్సు నుంచే మన సంస్కృతి, విలువలు అలవాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు కలెక్టర్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button