సినిమా

The Raja Saab: రాజాసాబ్‌పై రెబల్ ఫ్యాన్స్ నిరాశ.. మారుతీపై ఆగ్రహం!

The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా గత రాత్రి ప్రీమియర్ షోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలు రేకెత్తించిన ఈ చిత్రం ఓవర్సీస్ రివ్యూల్లో మిశ్రమ స్పందనలు అందుకుంది. దర్శకుడు మారుతీ నిర్వహణపై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.

మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన రాజాసాబ్ భారీ అంచనాల మధ్య థియేటర్లోకి అడుగుపెట్టింది. ప్రమోషనల్ కంటెంట్, ట్రైలర్, నాచే నాచే పాటతో హైప్ సృష్టించిన ఈ సినిమా మిశ్రమ రివ్యూలు సంపాదించింది. ప్రభాస్ ఎంట్రీ సన్నివేశాలు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నప్పటికీ, కథ ప్రారంభమైన వెంటనే ఆసక్తి తగ్గింది. కామెడీ సీన్లు బలవంతంగా అనిపించాయి. పాత స్టైల్ అంశాలు, పేలవమైన వీఎఫ్‌ఎక్స్ ప్రేక్షకులను నిరాశపరిచాయి.

ఇంటర్వెల్ నుంచి కొంత ఆసక్తికరంగా మారినా, సెకండాఫ్ మరింత గందరగోళంగా సాగింది. చివరి 30 నిమిషాలు మాత్రమే ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆసక్తికరమైన కాన్సెప్ట్‌ను అనవసర హంగులతో నీరుగార్చారని విమర్శలు వస్తున్నాయి. హారర్ ఎలిమెంట్స్ సరిగ్గా లేకపోవడం, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ లోపాలు ప్రధాన మైనస్‌లుగా మారాయి. థమన్ సంగీతం సాధారణంగా ఉంది. మొత్తంగా ప్రభాస్ నటన మాత్రమే హైలైట్‌గా నిలిచింది. దీంతో దర్శకుడు మారుతీపై రెబల్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button