ఆంధ్ర ప్రదేశ్
Tirupati: శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారం

తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. 450వ మెట్టు వద్ద చిరుత సంచారాన్ని గుర్తించిన భక్తులు టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ, అటవీశాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
చిరుత సంచారంతో దాదాపు రెండు గంటల పాటు శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రాకపోకలను నిలిపివేసింది టీటీడీ. పలు జాగ్రత్తలు పాటించాలని సూచించిన టీటీడీ ఉదయం 8 గంటల నుండి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతించింది.



