సినిమా
తెలంగాణలో రాజాసాబ్ టికెట్ ధరల పెంపునకు అనుమతి

తెలంగాణలో రాజాసాబ్ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్లకు 105 రూపాయలు, మల్టీప్లెక్స్‌లో 132 పెంచుకునేందుకు అనుమతి నిచ్చింది. టికెట్ల లాభాల్లో 20 శాతం ఫెడరేషన్‌కు ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 12 నుంచి 18 వరకు సింగిల్ స్క్రీన్లకు 62 రూపాయలు, మల్టీప్లెక్స్‌లో 89 రూపాయలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.



