అంతర్జాతీయం
Ice Tsunami: చైనాలో మంచు సునామీ.. వీడియో వైరల్

Ice Tsunami: శీతాకాలం కారణంగా ప్రపంచవ్యాప్తంగా భారీగా మంచు కురుస్తోంది. ఈ క్రమంలో చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో గడ్డకట్టిన ఓ నదిలో ఒక్కసారిగా మంచు సునామీ ఏర్పడింది. నదిలో భారీ అలలు రావడంతో పాటు చెట్లపై ఉన్న మంచు కూడా కింద పడింది. ఈ దృశ్యాలు చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



