ఆంధ్ర ప్రదేశ్

నేడు పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. 10 గంటలకు తాడేపల్లి నుండి హెలికాప్టర్ లో బయలుదేరి, 10. 40 ని.లకు పోలవరం ప్రాజెక్ట్ సైట్ లో ఏర్పాటుచేసిన హెలిపాడ్ కి చేరుకుని, అధికారులు, ప్రజాప్రతినిధులను కలుస్తారు. 10. 50 నుండి మధ్యాహ్నం 12. 30 వరకు పోలవరం ప్రాజెక్ట్ లోని కాఫర్ డ్యామ్, బట్రస్ , గ్యాప్ 1, గ్యాప్ 2, ఈసి ఆర్ ఎఫ్ డ్యామ్, కుడి కాలువ కనెక్టవిటీస్ పనుల ప్రగతిని పరిశీలిస్తారు.

అనంతరం మధ్యాహ్నం 12. 35 ని.లకు ప్రాజెక్ట్ సైట్ లోని గెస్ట్ హౌస్ కి చేరుకుంటారు. మధ్యాహ్నం 12. 35 ని.ల నుండి 1. 35 ని.ల వరకు అధికారులతో ప్రాజెక్ట్ నిర్మాణ పనుల ప్రగతిపై సమీక్షిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 2. 30 ని.ల వరకు ప్రెస్ మీట్ లో పాల్గొంటారు. అనంతరం 3. 10 ని.లకు పోలవరం నుండి హెలికాప్టర్ లో రాజమండ్రి బయలుదేరి వెళతారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button