సినిమా

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్

Tirumala: సినీ నటీమణులు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ముందుగా ఆలయంలోకి వెళ్ళిన మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ లు స్వామివారిని దర్శించుకొని మ్రొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం వైకుంఠ ఉత్తర ద్వార ప్రవేశం చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

జనవరి 14వ తేదీన అనగనగా ఒక రాజు చిత్రం కాబోతోందన్న మీనాక్షి చౌదరి చిత్ర విడుదలకు ముందు శ్రీవారిని దర్శించుకోవడం జోష్ గా ఉంటుందన్నారు.ఈ సంవత్సరం మధ్యలో నాగ చైతన్యతో నటించిన చిత్రం విడుదల అవుతుందన్నారు.టీటీడీ మంచి ఏర్పాట్లు చేసిందని ఐశ్వర్య రాజేష్ అన్నారు. సంక్రాంతికి విడుదలయ్యే ప్రతి చిత్రానికి ఆల్ ది బెస్ట్ తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button