ఆంధ్ర ప్రదేశ్
మా డాక్టర్ మాకే కావాలి.. ఆసుపత్రిలో డయాలసిస్ పేషెంట్ల ఆందోళన

మా డాక్టర్ మాకు కావాలి వేరే డాక్టర్ మాకు వద్దు అంటూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో అపోలోలో డయాసిస్ పేషెంట్లు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అపోలో డయాలసిస్ వార్డులో సుధాకర్ అనే డాక్టర్ పేషెంట్లకు దగ్గరగా ఉంటూ ప్రతి సమస్యను వివరిస్తూ చేదుడు వాదుడుగా నిలబడేవారని మంచి చేసే ఆ డాక్టర్ను తప్పించి పేషెంట్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేషెంట్ల బంధువులు తెలిపారు. సుధాకర్ డాక్టర్ను తిరిగి ఇక్కడకు పంపిచాలని పేషెంట్లు డిమాండ్ చేశారు.



