ఉక్రెయిన్ రష్యా వార్ కంటిన్యూ కానుందా?

ముగింపు లేని యుద్ధంగా ఉక్రెయిన్ రష్యా వార్ కంటిన్యూ కానుందా? ట్రంప్ తీసుకొచ్చిన 20 పాయింట్ ఫార్ములా అటకెక్కినట్లేనా? రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి నిజమేనా? పుతిన్ కోపం ఉక్రెయిన్ దేశాన్ని, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీని భూమిపై లేకుండా చేస్తాయా? తన అంతం చూడాలనుకున్న జెలెన్‌స్కీని పుతిన్ ఊరికే వదిలిపెడుతాడా? రష్యా తన ప్రత్యర్థి ఉక్రెయిన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకునే వరకు యుద్ధం కంటిన్యూ చేస్తుందా?
నాటో, ఈయూ ఏం చేసినా రష్యాను, ప్రెసిడెంట్ పుతిన్‌ను ఏమీ చేయలేవా? ఇవన్నీ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు గమనించే విశ్లేషకులను సైతం కలవలరపెడుతున్నాయి. యుద్ధం మొదలైన వారం పది రోజుల్లో వార్ ఫినిష్ అవుతుందనుకున్న వారందరూ ఇప్పటికీ ఆ యుద్దం అంతం కాదు ఇది ఆరంభం అన్నట్లు సాగుతుండం దేనికి సంకేతం అనే మాటలు వినిపిస్తున్నాయి.



