తెలంగాణ
ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాజన్నను దర్శించుకున్న ఆది శ్రీనివాస్

Vemulawada: హరి హర క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతన్నాయి. శ్రీ స్వామివారికి వారికి ఏకాంతంగా మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భీమేశ్వర స్వామి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో, రంగురంగుల పూలతో అలంకరించారు. శ్రీ స్వామివారికి ప్రాతఃకాల పూజను వేదమంత్రాలతో నిర్వహించారు.
పూజల అనంతరం పల్లకి సేవ పై ఉత్సవ మూర్తులను ప్రతిష్టించి వైకుంఠ ద్వారం ద్వారా స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించిన అంబారి సేవపై ఉత్సవమూర్తులను ప్రతిష్టించి పూజలు చేశారు. ముక్కోటి ఏకాదశి వేడుకల్లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.



