తెలంగాణ
బాల సాయిబాబా భూముల వ్యవహారంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం

బాల సాయిబాబా భూముల వ్యవహారంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 7 వేల కోట్ల విలువైన భూములను వదులుకోవడానికి సిద్ధమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొండాపూర్‌లోని బాల సాయిబాబా ట్రస్ట్ భూములపై కోర్టుకు సరైన నివేదిక ఇవ్వడంలో విఫలమైంది. చివరి అవకాశంగా ఫైన్‌తో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పినా ఐఏఎస్ అధికారి లోకేష్ పట్టించుకోలేదనే మాటలు వినిపిస్తున్నాయి.
బాలసాయిబాబా ట్రస్ట్ భూముల్లో అక్రమాలు జరిగాయని ఇప్పటికే ఏపీ దేవాదాయ శాఖ నివేదిక ఇచ్చింది. అయినా తెలంగాణ సర్కార్ స్పందించలేదు. 7 వేల కోట్ల విలువైన భూములపై ఎందుకీ నిర్లక్ష్యం..? ఎవరి కోసం ఈ జాప్యం..? అనే చర్చ జరుగుగోతంది. ఇప్పటికే ఈ భూముల్లో నూజివీడు సీడ్స్, భూపతి ఎస్టేట్స్ పాగా వేశాయి. తమకేమీ సంబంధం లేదన్నట్లు తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తోంది.



