సినిమా

Rakul Preet Brother: డ్రగ్స్ కేసులో చిక్కుకున్న రకుల్ సోదరుడు!

Rakul Preet Brother: హైదరాబాద్‌లో తాజా డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ పేరు తెరపైకి వచ్చింది. భారీ మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌లో ఇది చర్చనీయాంశమైంది. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.

మాసబ్ ట్యాంక్ పోలీసులు, ఈగల్ టీమ్ సంయుక్త దాడుల్లో భారీగా కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ అనే వ్యాపారులను అరెస్టు చేశారు. విచారణలో నలుగురు రెగ్యులర్ కస్టమర్లలో ఒకరిగా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు వెలుగులోకి వచ్చింది.

అతను ఈ వ్యాపారుల నుంచి క్రమం తప్పకుండా డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు తేలింది. 43 గ్రాముల కొకైన్, ఎండిఎంఏ డ్రగ్స్ పోలీసులు సీజ్ చేశారు. గతంలోనూ అమన్ డ్రగ్స్ కేసులో చిక్కుకుని బెయిల్ పై ఉన్నాడు. సినీ పరిశ్రమకు చెందినవారు ఇలాంటి కేసుల్లో చిక్కుకోవడం టాలీవుడ్, బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button