ఆంధ్ర ప్రదేశ్

Tirumala: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు.. లడ్డూ కౌంటర్‌లో టీటీడీ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీలు

Tirumala: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 30 నుంచి జనవరి 8వరకు జరగనున్న.. వైకుంఠ ద్వార దర్శనాలకు తరలివచ్చే భక్తుల కోసం అదనపు లడ్డూలు సిద్ధం చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. లడ్డూ ప్రసాదాల విక్రయ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. లడ్డూల బరువు చూసి, కౌంటర్లోని కియోస్క్ ను పరిశీలించారు.

ఆధార్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసి లడ్డూలు పొందే విధానం పరిశీలించి, భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం బూందీ పోటుకు వెళ్లి అధికారులకు సూచనలు చేశారు. లడ్డూల నాణ్యత, రుచి, క్యూలైన్లలో వేచి ఉండే సమయం తగ్గించడంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో లడ్డూల తయారీని పెంచి, భక్తులు వాటిని వేగంగా పొందే ఏర్పాట్లు చేస్తామన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button