Varanasi: వారణాసి.. జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ను మించి రేంజ్!

Varanasi: సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌలి కాంబినేషన్‌లో రూపొందుతున్న వారణాసి చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. 100కుపైగా దేశాల్లో విడుదలకు సన్నాధమవుతున్న ఈ చిత్రం జపాన్‌లో కూడా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆర్‌ఆర్‌ఆర్ విజయాన్ని మించేలా ప్లాన్ చేస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
మహేష్ బాబు, ఎస్.ఎస్. రాజమౌలి జంటగా రూపొందుతున్న వారణాసి చిత్రం ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌తో అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతోంది. 2027 సమ్మర్‌లో థియేటర్లలోకి రానున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుగుతోంది.
గ్లోబల్ స్థాయిలో 100కుపైగా దేశాల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా జపాన్‌లో గ్రాండ్ రిలీజ్‌కు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఐమాక్స్ జపాన్ సోషల్ మీడియాలో గ్లింప్స్ షేర్ చేసి 2027 రిలీజ్‌ను పరోక్షంగా తెలిపింది. ఆర్‌ఆర్‌ఆర్ జపాన్‌లో ఆలస్యంగా రిలీజ్ అయినా రికార్డు వసూళ్లు సాధించిన నేపథ్యంలో ఈసారి ఆలస్యం లేకుండా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
రాజమౌలికి జపాన్‌లో భారీ ఫ్యాన్ బేస్ ఉండటంతో వారణాసి కూడా అద్భుతమైన ఆదరణ పొందుతుందని అంచనా. ప్రమోషనల్ కంటెంట్‌తో ముందుగానే బజ్ క్రియేట్ చేయనున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.



