ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి కంపార్ట్మెంట్లు నిండి, వెలుపల క్యూలో భక్తులు నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 60,764 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 33,077 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.01 కోట్లుగా నమోదైంది.



