ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గొట్టిపాటి

Tirumala: తిరుమల శ్రీవారిని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆయన అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక సంక్షేమ ఫలాలు ప్రజలు అందుతున్నాయని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు.



