Champion: దూసుకుపోతున్న ఛాంపియన్!

Champion Trailer: ఛాంపియన్ ట్రైలర్‌ను రామ్ చరణ్ ఆవిష్కరించారు. యాక్షన్, ప్రేమ, తిరుగుబాటు సన్నివేశాలతో నిండిన ఈ ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. తెలంగాణ స్వాతంత్ర పోరాట నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రానుంది. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ సమర్పణలో స్వప్న సినిమా, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలింస్ బ్యానర్లపై రూపొందిన చిత్రం ఛాంపియన్. ప్రదీప్ అద్వైతం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రోషన్ హీరోగా నటించాడు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేశారు. 1947లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెలంగాణ స్వతంత్ర పోరాటంలో భాగమైన బైరాన్‌పల్లి నేపథ్యంలో కథ సాగుతుంది.
భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ఆకట్టుకునే ప్రేమకథను జోడించి ఆసక్తికరంగా తెరకెక్కించారు. అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కి జే మేయర్ సంగీతం అందించారు. డిసెంబర్ 25న క్రిస్మస్ స్పెషల్‌గా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు రోషన్ను మెచ్చుకుంటున్నారు.



