Vahini: క్యాన్సర్‌తో పోరాడుతున్న వాహిని!

Vahini: టాలీవుడ్ సహాయ నటి వాహిని రొమ్ము క్యాన్సర్‌తో గట్టిగా పోరాడుతున్నారు. ఆమె ఆరోగ్యం ఇటీవల మరింత క్షీణించడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సకు భారీ ఖర్చు అవసరమని వైద్యులు తెలిపారు. మరో సహా నటి కరాటే కళ్యాణి సాయం కోరుతూ పోస్టు పెట్టారు.
ప్రముఖ సహాయ నటి వాహిని గత కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడుతున్నారు.
ఇటీవల ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అధునాతన చికిత్స అందిస్తున్న వైద్యులు పూర్తి ట్రీట్‌మెంట్‌కు సుమారు 35 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
ఈ భారీ మొత్తం వాహిని కుటుంబానికి పెద్ద భారంగా మారింది. విషయం తెలియగానే మరో నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టి, వాహిని చికిత్సకు అందరూ ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పోస్టు వైరల్ కావడంతో టాలీవుడ్ అభిమానులు స్పందించడం మొదలైంది.
సినీ ప్రముఖులు ముందుకు వచ్చి సాయం చేయాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వాహిని గతంలో అనేక తెలుగు సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించారు. వాహినికి మద్దతుగా నిలవాలని టాలీవుడ్ అభిమానులు ప్రార్థిస్తున్నారు.



