PM Modi: తలైవాకి ప్రధాని మోడీ ప్రత్యేక శుభాకాంక్షలు!

PM Modi: సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ రోజు 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్‌లో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. రజనీ సినీ జీవితంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సంవత్సరమిదని కొనియాడారు.
దక్షిణ భారత సినీ దిగ్గజం, సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ రోజు 75వ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. 1975లో ‘అపూర్వ రాగంగల్’ సినిమాతో హీరోగా పరిచయమైన రజనీ ఈ ఏడాది సినీ జీవితంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తమిళ సినిమాతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాల్, ఇంగ్లిష్ భాషల్లోనూ నటించి దేశవ్యాప్త అభిమానుల్ని సంపాదించారు.
‘రోబో’, ‘ఎంతిరన్’, ‘సివాజీ’, ‘చంద్రముఖి’ వంటి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 సినిమా చేస్తున్నాడు.



