అఖండ-2 రిలీజ్ టీజర్‌తో అభిమానుల్లో జోష్!

Akhanda 2: నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. మేకర్స్ రిలీజ్ టీజర్ విడుదల చేశారు. బాలయ్య మాస్ ఎనర్జీతో నిండిన ఈ టీజర్ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ-2’ రేపు రిలీజ్ కానుంది. ప్రీమియర్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. థియేటర్ల వద్ద అభిమానుల రద్దీ భారీగా కనిపిస్తోంది. మేకర్స్ విడుదల చేసిన రిలీజ్ టీజర్ ఆద్యంతం బాలకృష్ణ మాస్ ఎనర్జీ, శక్తివంతమైన డైలాగులు, థమన్ బీజీఎంతో అదిరిపోయింది.
డ్యూయల్ రోల్లో బాలయ్య రెచ్చిపోయారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్‌గా, సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.



