Prabhas: స్లిం లుక్‌తో షాకిచ్చిన డార్లింగ్!

Prabhas: బాహుబలి స్పెషల్ షో కోసం జపాన్ వెళ్లిన ప్రభాస్ కొత్త స్లిమ్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. మాస్క్, క్యాప్ లేకుండా ఓపెన్‌గా కనిపించిన ఈ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ప్రభాస్ స్పిరిట్ కోసం కఠిన డైట్ చేశాడని తెలుస్తోంది.
బాహుబలి: ది ఎపిక్ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త లుక్‌తో షాక్ ఇచ్చాడు. స్లిం లుక్ లో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. గతంలో రాజాసాబ్ లుక్ లీక్ కాకుండా ఈవెంట్స్‌కు దూరంగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు ఏ మాస్క్, క్యాప్ లేకుండా ఓపెన్‌గా కనిపించాడు. సన్నగా, లీన్‌గా మారిన ఈ లుక్ చూసి ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.
చాలాకాలం తర్వాత మాచో ఇమేజ్ను వదిలేసి స్లిమ్ అవతారంలో కనిపించడం అభిమానులకు కొత్త అనుభూతినిస్తుంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో నటిస్తున్న ప్రభాస్ ఈ లుక్ కోసం కఠిన డైట్, వర్కౌట్ చేశాడని సమాచారం. జపాన్ ఈవెంట్లో ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు.



