Allu Arjun: బన్నీ స్పెషల్ పోస్ట్.. ‘పుష్ప 2’కి ఏడాది పూర్తి!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ విడుదలై ఒక ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా బన్నీ ఓ స్పెషల్ ఫోటో షేర్ చేశాడు. ఆ సినిమా యూనిట్‌తో ఐదేళ్ల ప్రయాణం మరచిపోలేనిదని ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అభిమానుల నుంచి వస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు.
ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘పుష్ప 2 : ది రూల్’ విడుదలై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక అద్భుతమైన ఫోటో షేర్ చేశాడు. క్లైమాక్స్ సన్నివేశాలను దర్శకుడు సుకుమార్‌తో చర్చిస్తున్న ఆ ఫోటోకు ఎమోషనల్ క్యాప్షన్ రాశాడు.
ఐదేళ్ల పాటు ఈ సినిమా కోసం తాను, మొత్తం యూనిట్ చేసిన కష్టం ఎప్పటికీ మరచిపోలేనిదని పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టి, ఇండియన్ సినిమాకే కొత్త గరిష్ఠాలు సృష్టించిన ఈ చిత్రం విజయానికి ప్రేక్షకులు అందించిన ప్రేమే ముఖ్య కారణమని బన్నీ ధన్యవాదాలు తెలిపాడు. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ కాగా, అభిమానులు మరోసారి ‘పుష్ప’ ఫీవర్‌లో మునిగిపోయారు.



