సినిమా
దిగ్గజ నిర్మాత కన్నుమూత!

తమిళ, తెలుగు సినీ పరిశ్రమకు అనేక ఎవర్‌గ్రీన్ చిత్రాలను అందించిన ఏవీఎం ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు ఎం.శరవణన్ కన్నుమూశారు. 86 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణంపై సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణ భారత సినీ రంగంలో లెజెండరీ నిర్మాణ సంస్థ ఏవీఎం ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు ఎం.శరవణన్ కన్నుమూశారు. 86 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో చెన్నైలో ఆయన తుది శ్వాస విడిచారు. ఏవీఎం లోగో, సంగీతం వినగానే ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోయే స్థాయి ఈ సంస్థకు ఉంది.
తమిళంలో శివాజీ, అయాన్, యజమాన్, తిరుపతి వంటి సూపర్ హిట్స్‌తో పాటు తెలుగులో భక్త ప్రహ్లాద, మూగ నోము, ఆ ఒక్కటీ అడక్కు లాంటి ఎవర్‌గ్రీన్ చిత్రాలను ఈ సంస్థ అందించింది. శరవణన్ మరణ వార్త తెలిసి సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



