సినిమా
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు జస్టిస్ శ్రీనివాస్, మంత్రి బాల వీరాంజనేయలు, సంగీత దర్శకుడు తమన్, నటుడు యశ్వీన్, యాంకర్ ఓంకార్ లు నైవేద్య విరామ సమయంలో వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు.



