సినిమా

నాని – సుజీత్ సినిమాకు క్రేజీ టైటిల్!

Nani-Sujeeth: స్టార్ హీరో నాని కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్ట్ ఖరారైంది. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో నాని నటిచ్చే ఈ సినిమాకు తాత్కాలిక టైటిల్ ‘గన్స్ అండ్ రోజెస్’గా ఉంది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది.

‘సాహో’ తర్వాత సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నాని 32వ సినిమాగా గణనీయమవుతోంది. ‘గన్స్ అండ్ రోజెస్’ అనే టైటిల్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పేరు ఫైనల్ కాకపోయినా, ఈ టైటిల్‌ను టీమ్ సీరియస్‌గానే పరిశీలిస్తోందని తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుందని, నాని కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడని సమాచారం. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. నాని హిట్ 3 తో హిట్ అందుకోగా, సుజిత్ OG తో ఆకట్టుకున్నాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button