సినిమా
Ram Charan: నాన్నని తొలిసారి టీవీలో చూసి ఎగ్జైట్ అయిన రామ్ చరణ్ కూతురు క్లీంకార.. వీడియో వైరల్..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కుమార్తె క్లీంకార తొలిసారి టీవీలో తన నాన్నను చూసి ఎగ్జైట్ అయ్యింది. రామ్ చరణ్ నటించిన “ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్” డాక్యుమెంటరీ చూస్తుండగా, తెరపై తన నాన్న కనిపించగానే క్లీంకార మురిసిపోయి సంతోషంగా సైగలు చేసింది. ఈ విషయాన్ని ఉపాసన ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఉపాసన పోస్టులో, రామ్ చరణ్‌ని చూస్తుంటే గర్వంగా ఉంది. గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ పేర్కొంది.