తెలంగాణ
తెలంగాణ ప్రజలకు ఉగాది కానుక.. నేడు సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభం

తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్. నేడు ఉగాది కానుకగా రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రతి రేషన్ కార్డుదారునికి ఆరు కిలోల చొప్పున బియ్యం ఇవ్వనున్నారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కేజీల చొప్పున బియ్యం అందుతుంది.
జనవరిలో ఇచ్చిన కొత్త రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో ఇప్పుడు 91.19 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 2.82 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు. కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను కూడా పరిశీలిస్తున్నారు. ఆ ప్రక్రియ పూర్తయితే, మొత్తం రేషన్ కార్డుల సంఖ్య కోటి దాటుతుంది. లబ్ధిదారుల సంఖ్య 3.10 కోట్లకు చేరుతుంది. వీరందరికీ నెలకు 1.80 లక్షల టన్నుల బియ్యం సరఫరా చేయనున్నారు.