ఆంధ్ర ప్రదేశ్

Nirmala Sitharaman: రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించడం ఒక యజ్ఞం లాంటిది

Nirmala Sitharaman: అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ , మంత్రులు పయ్యావుల కేశవ్, నారా లోకేష్ పాల్గొన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

ప్రపంచంలోనే స్ఫూర్తిదాయక ల్యాండ్‌పూలింగ్‌ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని అన్నారు. 2028 మార్చి నాటికి పూర్తయ్యేలా అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రాజధాని నిర్మాణానికి నిర్మల రూ.15వేల కోట్ల నిధులిచ్చారని ఆయన గుర్తు చేశారు. నిర్మలాసీతారామన్‌ చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. జీఎస్టీ సంస్కరణలు గేమ్‌ఛేంజర్‌గా మారాయన్నారు. సూపర్‌ జీఎస్టీ సంస్కరణలతో ఆర్థిక వృద్ధి జరిగేందుకు సీతారామన్‌ ఎంతో కృషి చేశారు.

రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించడం ఒక యజ్ఞం లాంటిదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ అన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం నూతన రాజధాని నిర్మాణం అంటే సామాన్యం కాదని తెలిపారు. ఒకే చోట ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా కంపెనీలు ఉండటం చాలా అరుదు అని నిర్మల అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button