Andrea Jeremiah: పిశాచి 2లో ఆ సీన్స్.. ఆండ్రియా వైరల్ వ్యాఖ్యలు!

Andrea Jeremiah: హారర్ బ్లాక్ బస్టర్ ‘పిశాచి’ సీక్వెల్ ‘పిశాచి 2’పై హీరోయిన్ ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాలో ఎరోటిక్ సన్నివేశాలు ఉంటాయని ఆమె స్పష్టం చేసింది. దీంతో అభిమానులకు ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
మిస్కిన్ తెరకెక్కించిన ‘పిశాచి’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘పిశాచి 2’ను రూపొందిస్తున్నారు. హాట్ బ్యూటీ ఆండ్రియా ఈ చిత్రంలో నాయికగా నటిస్తున్నారు. చాలా ఏళ్లుగా వాయిదాలు పడుతూ వస్తోన్న ఈ మూవీపై రీసెంట్ గా ఆండ్రియా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
“సినిమాలో న్యూడిటీ ఏమీ లేదు కానీ ఎరోటిక్ సీన్స్ ఉంటాయి” అని ఆమె ఓపెన్ గా చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. పూర్ణ, సంతోష్ ప్రతాప్ వంటి నటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాక్‌ఫోర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కార్తిక్ రాజా సంగీతం అందిస్తున్నారు. తెలుగులో దిల్ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలా మెప్పిస్తుందో చూడాలి.



