ఆంధ్ర ప్రదేశ్
ఏం గుండె రా వాడిది.. ఒకే బైక్‌పై ఐదుగురు యువకులు రైడ్.. వీడియో చూస్తే స్టన్

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జె.కొత్తూరు శివారులో కొందరు కుర్రాళ్లు ప్రమాదకర రీతిలో ప్రయాణించారు. ద్విచక్ర వాహనంపై సాధారణంగా ఒకరిద్దరో, మరీ అయితే ముగ్గురో ప్రయాణించడం చూస్తుంటాం. కానీ ఒకే బైక్‌పై ఐదుగురు యువకులు ప్రయాణించడం అందరిని షాక్‌కు గురిచేసింది. దీనికి తోడు ఐదుగురు యువకులు నెంబర్ ప్లేట్ లేని బైక్‌పై నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నారు. ఇలాంటి వారిపై ఎప్పటికప్పుడు పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.



