తెలంగాణ
Telangana: బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

Telangana: తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ బీసీ రిజర్వేషన్లపై స్పష్టతనిచ్చింది. బీసీ రిజర్వేషన్లను 17 శాతానికి తగ్గించారనే వార్తలు అవాస్తవమని శాఖ తెలిపింది. 2019 పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఈసారి రిజర్వేషన్లు ఖరారు చేశామని, ఎస్టీ నోటిఫైడ్ గ్రామాలు కలపడం వల్ల లెక్కల్లో స్వల్ప మార్పు వచ్చిందని వివరించింది. ఎస్టీ ప్రాంతాల్లో బీసీ రిజర్వేషన్లు వర్తించవని స్పష్టం చేసింది. 2019లో బీసీ రిజర్వేషన్లు 22.78 శాతం ఉండగా ఈసారి 21.39 శాతానికి స్వల్పంగా తగ్గినట్లు తెలిపింది.



