సినిమా

రకుల్ ప్రీత్ హెచ్చరిక!

Rakul Preet Singh: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరుతో ఫేక్ వాట్సాప్ అకౌంట్ సృష్టించిన మోసగాళ్లకు ఆమె కఠిన హెచ్చరిక జారీ చేశారు. స్క్రీన్‌షాట్‌తో సహా సోషల్ మీడియాలో పోస్టు చేసి అప్రమత్తం చేశారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

ఇటీవల సెలబ్రిటీల పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించి మోసాలు జరుగుతున్న సంఘటనలు పెరిగాయి. అదితిరావ్ హైదరీ తర్వాత ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ పేరుతో ఫేక్ వాట్సాప్ అకౌంట్ ఓపెన్ అయ్యింది. ఈ అకౌంట్ నుంచి పలువురికి మెసేజ్‌లు పంపి మోసం చేయడానికి యత్నిస్తున్నట్టు రకుల్ గుర్తించారు.

వెంటనే సోషల్ మీడియాలో స్క్రీన్‌షాట్ పంచుకుని ‘ఇది నా అకౌంట్ కాదు, ఆ నెంబర్ నుంచి మెసేజ్ వస్తే బ్లాక్ చేయండి’ అని హెచ్చరించారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ ఈ ఘటనతో అప్రమత్తమయ్యారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button