షారుఖ్ పై స్పిరిట్ నటుడు షాకింగ్ కామెంట్స్?

‘స్పిరిట్’ సినిమలో నటిస్తున్న వివేక్ ఒబెరాయ్ ఇటీవల షారుఖ్ ఖాన్ గురించి చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. పేరు, ఫేమ్ శాశ్వతం కాదని, పెద్ద స్టార్లు కూడా ఒకానొక రోజు మసకబారతారని ఆయన అన్నారు.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్న వివేక్ ఒబెరాయ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ గురించి మాట్లాడారు. పేరు, ప్రఖ్యాతి శాశ్వతం కాదని, ఎంత పెద్ద స్టారైనా ఒక రోజు మసకబారిపోతాడని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
షారుఖ్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, మరికొందరు దీన్ని సహజమైన విషయంగా భావిస్తున్నారు. గతంలోనూ వివేక్ ఒబెరాయ్, షారుఖ్ ఖాన్ మధ్య కొన్ని వివాదాలు బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ కామెంట్స్ మరింత చర్చనీయాంశమయ్యాయి. సినీ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.



