జాతియం
యూపీలోని గ్యాంగ్స్టర్ల స్థావరాలపై యోగి సర్కార్ కొరడా

బరేలీ హింసాకాండకు పాల్పడిన మౌలనా తౌకీర్ రజా సన్నిహితుడు మహ్మద్ ఆరిఫ్‌కు చెందిన అక్రమ ఆస్తులను యోగి సర్కార్ నేలమట్టం చేసింది. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య శనివారం మధ్యాహ్నం కూల్చివేతలు ప్రారంభించింది బరేలీ డెవలప్మెంట్ అథారిటీ. భవనం కూల్చివేతల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం దుమ్ముతో నిండిపోయింది.
రెండు రోజులపాటు కొనసాగిన కూల్చివేతలు చివరకు విజయంతంగా ముగిశాయి. అనుమతులు తీసుకోకుండా నిర్మించిన అక్రమ ఆస్తులను బుల్డోజర్ల సహాయంతో కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమ ఆస్తుల కూల్చివేతకు ముందు ఆరిఫ్‌కు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.



