అఖండ-2 థియేట్రికల్ రైట్స్.. బాలయ్య కెరీర్ బెస్ట్ డీల్స్!

Balakrishna: నందమూరి బాలకృష్ణ ‘అఖండ-2’ సినిమా థియేట్రికల్ రైట్స్ రికార్డు ధరలకు అమ్ముడయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏరియాలు భారీ ధర పలికాయి. నైజాం 30 కోట్లకు దిల్ రాజు సొంతం కానుంది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ-2’ డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఫస్ట్ గ్లింప్స్ సృష్టించిన సంచలనం, భారీ బడ్జెట్, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో సినిమా అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే షూటింగ్, డబ్బింగ్ పూర్తయింది. ఇదే ఉత్సాహంలో ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి.
ఉత్తరాంధ్ర 13.50 కోట్లకు గాయత్రీ దేవి ఫిల్మ్స్, సీడెడ్ 24 కోట్లకు శోభన్, గుంటూరు 9.50 కోట్లకు రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకున్నాయి. నైజాం హక్కులు దిల్ రాజు చేతికి 30 కోట్లకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. బాలయ్య కెరీర్లోనే అత్యధిక థియేట్రికల్ బిజినెస్‌గా ఇది నిలుస్తుందని అంచనా.



