ఆంధ్ర ప్రదేశ్
అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన

అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి నారాయణ. సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటు కొండవీటి వాగు, గుంటూరు ఛానెల్, బకింగ్ హాం కెనాల్స్ పై నిర్మిస్తున్న బ్రిడ్జిలను కూడా పరిశీలించారు మంత్రి. సీడ్ యాక్సిస్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే కొండవీటి వాగు ఎత్తిపోతల వద్ద జరుగుతున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు.



