జాతియం

Supreme Court : తలాక్-ఎ-హసన్‌.. ఆధునిక సమాజంలో ఎలా అనుమతించగలం?

Supreme Court : ముస్లింల విడాకులు అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది ట్రిపుల్ తలాక్. భర్త అయిన ముస్లిం వ్యక్తి తలాక్, తలాక్, తలాక్ అని మూడు సార్లు చెప్పి ఏకపక్షంగా భార్యకు విడాకులు ఇచ్చే పద్ధతి ఇది. ఈ ట్రిపుల్ తలాక్‌ను సర్వోన్నత న్యాయస్థానం 2017లో ఇచ్చిన తీర్పు అనంతరం రద్దు చేసింది. అయితే.. ట్రిపుల్ తలాక్‌లో మరో రూపం తలాక్ ఇ హసన్‌‌‌ను పలువురు అనుసరిస్తున్నారు.

దీని ప్రకారం నెలకు ఒకసారి చొప్పున వరుసగా మూడు నెలలు తలాక్ పదాన్ని ఉచ్చరించి భార్యకు విడాకులు ఇస్తున్నారు. మూడవ ప్రకటన తర్వాత సయోధ్య జరగకపోతే విడాకులు తిరిగి పొందలేవు. ప్రస్తుత పద్ధతి కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ను కలిగి ఉంది. ఇది ట్రిపుల్ తలాక్‌తో పోలిస్తే ఇది మరింత ఆలోచనాత్మకమైన విడాకులుగా ముస్లింలు పరిగణిస్తారు. దీని ద్వారా భర్త వెంటనే విడాకులు తీసుకోవచ్చు.

తాజాగా.. తలాక్ ఇ హసన్ చట్టబద్దతను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తలాక్-ఎ-హసన్ అనేది ట్రిపుల్ తలాక్‌కు మరో రూపం. ఇది తలాక్-ఎ-బిద్దత్‌కు భిన్నంగా ఉంటుంది. ఈ విధానంలో తక్షణమే విడాకులు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది దూరాచారమంటూ పద్దతిని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. దాని రాజ్యంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలూన పలు పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి నివేదించింది.

ఆధునిక సమాజంలో ఇలాంటి పద్ధతులను ఎలా అనుమతిస్తారు? అంటూ పలు కీలక ప్రశ్నలు సంధించింది. ఇస్లాంలో ఎన్ని విడాకుల పద్ధతులు ఉన్నదీ లిఖితపూర్వకంగా తమకు క్లీయర్‌గా వివరించాల్సిందిగా ఇరు పక్షాలకూ జస్టిస్‌ సూర్యకాంత్‌ సూచించారు. ఎనిమిదేళ్ల క్రితం ఇన్‌స్టంట్ ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు, ఇప్పుడు మరో విడాకుల పద్ధతిపై దృష్టి సారించింది.

ఓ ముస్లిం మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఓ మహిళకు ఆమె భర్త తన న్యాయవాది ద్వారా విడాకుల నోటీసు పంపించాడు. ఆ తర్వాత అతను మరో వివాహం చేసుకున్నాడు. అయితే 11 పేజీల తలాక్ నోటీసుపై భర్త సంతకం లేకపోవడంతో తన బిడ్డకు స్కూల్‌లో అడ్మిషన్ ఇప్పించడానికి ఇబ్బందులు పడుతున్నానని ఆమె కోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.

ఇస్లాంలో ఇది సాధారణ పద్ధతేనని భర్త తరఫు న్యాయవాది వాదించగా ఇదొక పద్ధతి ఎలా అవుతుంది..? ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు ఎలా పుట్టుకొస్తున్నాయి? అని కోర్టు ప్రశ్నించింది. విడాకుల విషయంలో భార్యతో నేరుగా మాట్లాడటానికి భర్తకు ఉన్న అహంకారం ఏంటి..? ఇది ఒక మహిళ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఆధునిక సమాజంలో ఇలాంటి వాటిని ఎలా ప్రోత్సహిస్తారు? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. మతపరమైన పద్ధతుల ప్రకారం విడాకులు తీసుకోవాలనుకుంటే, నిర్దేశించిన పూర్తి విధానాన్ని పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా మహిళలు పరిస్థితి, జర్నలిస్టులు, వైద్యులు ఇలాంటి అనుభవాలు ఎదుర్కొంటుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ముస్లిం సమాజంలో ఉన్న విడాకుల విధానాలు గురించి సమాచారం కోరుతూ తదుపరి విచారణలో భర్త హాజరు కావాలని ఆదేశించింది. అతడు ఇక్కడికి వచ్చి ఆమెకు కావలసింది బేషరతుగా అందించాలి అని కోర్టు చెప్పింది.

తన కేసును తానే వాదించకున్నందుకు ఆ మహిళను ప్రశంసిస్తూ పేదల పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించింది. తన హక్కుల కోసం పోరాటాన్ని ఎంచుకున్న ఈ మహిళకు సెల్యూట్ చేస్తున్నాం. కానీ పేద మహిళ తిరిగి వివాహం చేసుకుంటే.. మాజీ భర్త వచ్చి ఆమెతోనే ఉంటున్నానని చెబుతాడా..? నాగరిక సమాజం ఈ రకమైన ఆచారాన్ని అనుమతించాలా? అని కోర్టు వ్యాఖ్యానించింది.

కాగా.. ఇస్లాంలో అత్యంత ప్రబలంగా ఉన్న ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమని 2017లో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఈ చట్టం యొక్క రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 12 పిటిషన్‌లను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.

కోజికోడ్‌కు చెందిన ముస్లిం సంస్థ సమస్తా కేరళ జమియత్ ఉల్ ఉలేమా ఈ కేసులో ప్రధాన పిటిషనర్‌గా ఉంది. ఈ పిటిషన్లపై తమ వ్రాతపూర్వక ప్రాతినిధ్యాలను దాఖలు చేయాలని కేంద్రాన్ని, ఇతర పక్షాలను కూడా కోరింది. మూడు పేజీలకు మించకుండా తమ వాదనలకు మద్దతుగా వ్రాతపూర్వక ప్రాతినిధ్యాలను కూడా దాఖలు చేయాలని స్పష్టం చేసింది.

పిటిషనర్లు ట్రిపుల్ తలాక్ ఆచరణను నేరంగా పరిగణించడాన్ని మాత్రమే సవాలు చేస్తున్నారని సుప్రీం తెలిపింది. కానీ.. ట్రిపుల్ తలాక్ పద్ధతిని సమర్థించడం లేదని బెంచ్ వ్యాఖ్యానించింది. ఆగస్ట్ 22 ట్రిపుల్ తలాక్ సంప్రదాయం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం 2019 జూలై 30న ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించింది. ముస్లిం మతంలో ఆచరించే ట్రిపుల్ తలాక్ సంప్రదాయం చాలా ప్రమాదకరమని కేంద్రం తెలిపింది. ఈ పద్దతి వల్ల అనేక మంది ముస్లిం మహిళలు దయనీయమైన స్థితిలోకి నెట్టబడ్డారని తెలిపింది.

ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకోకుండా వివాహిత ముస్లిం మహిళలను రక్షించేందుకే ఈ చట్టాన్ని ఆమోదించామని తెలిపింది. ఈ ఆచారం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించినప్పటికీ, ముస్లిం సమాజం దీనిని పారదోలడానికి చర్యలు తీసుకోలేదని, అందుకే చట్టం చేశామని పేర్కొంది. వివాహిత ముస్లిం మహిళలకు లింగ న్యాయం, లింగ సమానత్వాన్ని నిర్ధారించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని తేల్చి చెప్పింది.

అంతేగాక వివాహిత ముస్లిం మహిళల హక్కులను కూడా పరిరక్షిస్తుందని స్పష్టం చేసింది. ఇందులో ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించి మూడేళ్ల జైలు శిక్ష విధించేలా నిబంధనలు రూపొందించారు. అయితే జమియత్ ఉలమా-ఏ-హింద్, సమస్తా కేరళ జమియతుల్ ఉలేమా అనే రెండు ముస్లిం సంస్థలు ఈ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని పేర్కొన్నాయి.

భారతదేశంలో ఇప్పటివరకు ఈ విధానాన్ని నేరంగా తీసుకున్నారు. భారతదేశంలో ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధం. ఇస్లాంలో పూర్వం, పురుషులు మూడుసార్లు తలాక్-తలాక్ చెప్పి స్త్రీలకు విడాకులు ఇచ్చేవారు. కానీ సుప్రీంకోర్టు దానిని నిషేధించిందిజ. అయితే.. ఇస్లాంలో ట్రిపుల్ తలాక్ కాకుండా ఇంకా చాలా రకాల విడాకులు ఉన్నాయి. ఇస్లాంలో నాలుగు రకాల విడాకులు ప్రస్తావించబడ్డాయి. వీటిలో తలాక్-ఎ-హసన్, తలాక్-ఎ-కినాయా, తలాక్-ఎ-బెయిన్ మరియు తలాక్-ఎ-బిద్దత్ అంటే ట్రిపుల్ తలాక్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం తలాక్-ఎ-హసన్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు తలాక్-ఎ-కిన్యాలో ఒకేసారి విడాకులు ఇస్తారు.

ఈ విడాకులను మౌఖికంగా, రాతపూర్వకంగా లేదా వాట్సాప్ సందేశం ద్వారా కూడా ఇవ్వవచ్చు. దీనిలో, భర్త తన భార్యకు ఖాజీ సమక్షంలో సమావేశంలో లేదా బహిరంగంగా మీ నుండి విడిపోతున్నానని మేసేజ్ చేయడం ద్వారా జరుగుతుంది. ఇక తలాక్-ఎ-బెయిన్‌ను ఒకేసారి రాయడం ద్వారా, మాట్లాడటం ద్వారా లేదా బహిరంగంగా ఇవ్వవచ్చు. ఈ సమయంలో పురుషుడు నేను నీ నుండి విడిపోవాలనుకుంటున్నానని స్త్రీకి చెప్పవచ్చు. నేను నిన్ను విడిపించాను, నువ్వు ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నావు, నువ్వు ఈ సంబంధం హరామ్, నువ్వు ఇప్పుడు నా నుండి వేరుగా ఉన్నావు. ఇలాంటి వాటి ద్వారా ఒకేసారి విడాకులు తీసుకోవచ్చు.

ఈ నేపథ్యంలో ఏయే ముస్లిం దేశాల్లో ఇలాంటి తలాక్‌లు అమల్లో ఉందనే చర్చ జరుగుతుంది. కాగా ప్రస్తుతం ఆరు నెలల పాటు ట్రిపుల్ తలాక్‌ను నిషేధించడంతో ట్రిపుల్ తలాక్ లేని దేశాల్లో భారత్ చేరింది. పాకిస్తాన్, జోర్డాన్, ఈజిప్ట్, ట్యునీషియా, బంగ్లాదేశ్, బ్రూనై, యూఏఈ, ఇండోనేషియా, ఇరాక్, శ్రీలంక, టర్కీ, సైప్రస్, సిరియా, సిరియా, అల్జీరియా, ఇరాన్, మలేషియా లాంటి దేశాల్లో ఇలాంటి తలాక్‌లు ఇంకా నడుస్తున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button