సినిమా
IBomma One: మళ్లీ తెరపైకి ఐబొమ్మ.. ‘ఐబొమ్మ వన్’తో పైరసీ కొనసాగింపు!

IBomma One: పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ మూసివేత తర్వాత కొన్ని గంటలకే ‘ఐబొమ్మ వన్’ పేరుతో కొత్త సైట్ ఆన్‌లైన్‌లోకి వచ్చింది. ఇది మూవీరూల్స్‌కు రీడైరెక్ట్ అవుతోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టుతో సైట్ పూర్తిగా బంద్ అయినట్లు అనిపించింది. నిర్మాతలు, నటులు పోలీసులను అభినందించారు. నిర్మాత సీ కల్యాణ్ ఎన్‌కౌంటర్ వ్యాఖ్యలు చేసిన గంటల్లోనే ‘ఐబొమ్మ వన్’ పేరుతో కొత్త వెబ్‌సైట్ ఆవిర్భవించింది.
పాత ఐబొమ్మలా కొత్త సినిమాలు అందుబాటులో ఉండటం, క్లిక్ చేస్తే మూవీరూల్స్‌కు కనెక్ట్ కావడం గమనార్హం. దీంతో పైరసీ సమస్య మళ్లీ తలెత్తింది. టాలీవుడ్ నిర్మాతలు మళ్లీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



