ఆంధ్ర ప్రదేశ్
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికులు ఆందోళన

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో కార్మికులు ఆందోళనకు దిగారు. అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట నిరసన తెలిపారు కార్మికులు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామని యాజమాన్యం సర్కులర్ జారీ చేయడం దారుణమన్నారు కార్మికులు.
ఆ సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కార్మికులు అసహనం వ్యక్తం చేస్తూ కూడా నిరసన తెలిపారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కార్మికుల వైపు వేలు చూపిస్తోందన్నారు.



