Ranbir Kapoor: ఫేక్ ఇన్స్టా ఖాతాతో రణబీర్ కపూర్ సరికొత్త ప్రయోగం!

Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. తన గుర్తింపు దాచి సామాన్యుల్లా సోషల్ మీడియా ఉపయోగిస్తున్నాడు. ఇది ఫన్స్టా ఖాతా అని పిలుస్తానని చెప్పాడు. ఆలియా భట్ కూడా సరదాగా స్పందించింది.
బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ కి సోషల్ మీడియాలో అధికారిక ఖాతా లేకపోవడం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు తన గుర్తింపు దాచి ఒక ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచినట్టు వెల్లడించాడు. సామాన్యులు ఎలా ఉంటారో, తన అభిమానులు ఎలా వ్యవహరిస్తారో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రయోగం చేశానని చెప్పాడు. ఈ ఖాతాను ‘ఫన్స్టా’ అని పిలుస్తానని, తనకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులను అనుసరించడానికి ఉపయోగిస్తానని తెలిపాడు.
అధికారిక ఖాతా తెరిచి నటుడిగా తన గుర్తింపును బయటపెట్టాలని ఇష్టం లేదని, నటన-సినిమాలే తన ఐడెంటిటీ అని స్పష్టం చేశాడు. ఈ విషయం విన్న ఆలియా భట్ సరదాగా.. ‘నన్ను కూడా ఫాలో చేయడానికి అనుమతి లేదు’ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఆలియా ‘ఆల్ఫా’ సినిమాతో బిజీగా ఉండగా, రణబీర్ ‘రామాయణం’ ‘యానిమల్ 2’లో నటిస్తున్నాడు.



