సినిమా

కాంత మెప్పించిందా?

Kaantha: కాంత సినిమా అంటే కేవలం కథ కాదు.. నటుల ఆత్మ ప్రాణం కూడా! ఒక్కొక్క సీన్‌లో ప్రాణం పోసిన హీరో అండర్ ప్లేలోనూ అదరగొట్టిన సీనియర్ ఆర్టిస్ట్.. ఆశ్చర్యపరిచిన హీరోయిన్ అయితే ఈ సినిమా అందరికీ నచ్చుతుందా? పూర్తి వివరాలు చూద్దాం..

దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. లుక్, బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్ ప్రతి కోణంలోనూ పర్ఫెక్ట్ అనే చెప్పాలి. ఒక్క తప్పు కూడా దొరకని స్థాయిలో నటించాడు. సముద్రఖని మళ్లీ నటుడిగా గుర్తుచేశాడు. చాలా సన్నివేశాల్లో అండర్ ప్లే చేసి సూక్ష్మ ఎక్స్‌ప్రెషన్స్‌తో సీన్‌ను ఎలివేట్ చేశాడు. ముఖ్యంగా ఒక సీన్‌లో అతని కళ్లలో కనిపించే భావం అద్భుతంగా ఉంది. భాగ్యశ్రీ కూడా ఈసారి నటనలో మంచి మార్కులు సాధించింది.

స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, ఎమోషనల్ సీన్స్‌లో ఆకట్టుకుంది. అయితే దర్శకుడు సెల్వ అత్యంత డీటెయిలింగ్‌తో సన్నివేశాలు రాసినందువల్ల కొన్ని చోట్ల స్లో ఫేస్ ఫీల్ కలుగుతుంది. ఆర్టిస్టిక్ మూడ్ ఎక్కువగా, కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉన్నాయి. మొత్తానికి విమర్శకులకు ఫుల్ మీల్స్ అయితే సామాన్య ప్రేక్షకులకు కొంచెం భారంగా అనిపించే అవకాశం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button