ఆంధ్ర ప్రదేశ్

Vidadala Rajini: మెడికల్ కాలేజీలపై ప్రభుత్వ నిర్ణయం దుర్మార్గం

Vidadala Rajini: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. చిలకలూరిపేట పట్టణ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు జరిగిన ఈ ర్యాలీలో మాజీ మంత్రి విడదల రజిని పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వ నిర్ణయం దుర్మార్గమన్నారు విడదల రజిని. సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలను వైసీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు విడదల రజిని.

పేదలకు సంజీవనిలా ఉన్న వైద్యాన్ని ప్రవేటికరణ చేయడం సమంజసం కాదన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు తీసుకువస్తే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవటీకరణ పేరుతో అమ్ముకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల ఆరోగ్య భద్రత కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు రజిని.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button