ఆంధ్ర ప్రదేశ్
ACB Raids: రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ అధికారి

ACB Raids: అనకాపల్లి జిల్లాలో పెదనందిపల్లిలో ఏసీబీకి అవినీతి తిమింగలం చిక్కింది. వ్యవసాయ భూమిని మ్యుటేషన్ చేసేందుకు రైతును రెవెన్యూ అధికారి 20వేలు లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇచ్చేందుకు ఇష్టం లేక రైతు ఏసీబీని ఆశ్రయించాడు. రైతు నుంచి రూ. 20వేలు లంచం తీసుకుంటుండగా రెవెన్యూ అధికారి సూర్యనారాయణ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.



