సినిమా

Globetrotter: గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌కు మీడియా కెమెరాలు నిషేధం!

Globetrotter: మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 టైటిల్ రిలీజ్ ఈవెంట్‌కు ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. హాట్‌స్టార్ మీడియా కెమెరాలకు అనుమతి నిరాకరించింది.

సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా, దర్శక దిగ్గజం ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 చిత్రం టైటిల్ రిలీజ్ ఈవెంట్‌కు కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 15న చిత్ర టైటిల్‌తో పాటు మహేశ్ బాబు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ ఈవెంట్‌ను అపూర్వంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. హాట్‌స్టార్ ఓటీటీలో మాత్రమే స్ట్రీమింగ్ చేసేలా డీల్ కుదుర్చుకుంది.

ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌కు మహేశ్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ భారీ ఈవెంట్‌కు ఇతర మీడియా సంస్థల కెమెరాలను అనుమతించకూడదని హాట్‌స్టార్ ఆదేశాలు జారీ చేసింది. మీడియా ప్రతినిధులను అనుమతిస్తూ వారి కెమెరాలకు మాత్రం అనుమతి నిరాకరించింది. ఈవెంట్ ఎంట్రీ పాస్‌లకు భారీ డిమాండ్ నెలకొంది. ఘట్టమనేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌కు లక్ష మంది అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్‌ను రాజమౌళి ఖరారు చేశాడని టాక్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button