తెలంగాణ
Bus Fire: మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 28 మంది

Bus Fire: తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. నల్గొండ జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ఘటన జరిగింది. ఇంజన్‌లో మంటలు చెలరేగడంతో ట్రావెల్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. విహారీ ప్రైవేట్ ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుంది. ప్రమాదం సమయంలో బస్సు 28 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఇంజన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతోప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అధికారులు అదుపు చేశారు. వరుస బస్సు ప్రమాదాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.



