తెలంగాణ
బోరబండలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతల దాడి

బోరబండలో ఉద్రికత్త నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలింగ్ వద్దకు రాకుండా కాంగ్రెస్ నేత బాబా ఫసియుద్దీన్ అడ్డుకున్నారు. శ్రీనగర్ కాలనీలోని 276 బూత్‌లో కాంగ్రెస్ కండువాలతో ప్రచారం చేయడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
రహమత్‌నగర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ హల్చర్ చేశారు. నాన్‌లోకల్ ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ ప్రచారంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రహ్మత్‌నగర్ డివిజన్‌లో అనుచరులతో శంకర్‌నాయక్ హల్చల్ చేయడంపై ఆర్వోకు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.



