ఆంధ్ర ప్రదేశ్
Bhimavaram: తల్లి, తమ్ముడిని చంపిన అన్న

Bhimavaram: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం జరిగింది. తల్లిని తమ్ముడ్ని దారుణంగా అన్న హత్య చేశాడు. స్థానిక సుంకర పద్దయ్య గారి వీధిలో ఉంటున్న 60 సంవత్సరాల గునుపూడి మహాలక్ష్మి, 33 సంవత్సరాల రవితేజను గునుపూడి శ్రీనివాస్ వారి ఇంటిలోనే అతి దారుణంగా హత్య చేశాడు.
అనంతరం తానే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రవితేజ భీమవరంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు.హంతకుడికి మతిస్థిమితం లేదని సమాచారం. రెండు హత్యలకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



