ఆంధ్ర ప్రదేశ్
నరసరావుపేట స్వాతి షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని స్వాతి షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం చోటచేసుకుంది. షాపింగ్ మాల్లోని సెకండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది షాపింగ్ మాల్ సిబ్బంది. దీంతో మంటలు పూర్తిగా వ్యాపించాయి.
స్థానికల సమాచారంతో ఘటన స్థలీకి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. షాపింగ్ మాల్ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.



