Sricharani: దేశం మొత్తం మారుమోగుతున్న శ్రీచరణి పేరు

Sricharani: శ్రీ చరణి ఇపుడు దేశం మొత్తం ఈ పేరు మారుమోగుతోంది. తొలిసారి భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్‌ను ముద్దాడిన వేళ జట్టులో కీలకంగా వ్యవహరించిన శ్రీచరణి పాత్రపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కడప జిల్లా వీరపునాయుని పల్లె మండలం ఎర్రమల్లె గ్రామానికి చెందిన నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రేణుక దంపతుల రెండో సంతానం శ్రీచరణి. క్రికెట్ అంటే ఆసక్తి ఉన్న శిక్షణ తీసుకునేందుకు ఏ సదుపాయాలు లేవు.
తల్లిదండ్రులు వద్దని చెప్పిన మొండి పట్టు పట్టి వారిని ఒప్పించి మేనమామ సహకారంతో క్రికెట్లో రాణించింది శ్రీచరణి. ప్రతి మ్యాచ్‌లో తన ప్రతిభను కనబరిచింది. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ గా రాణించి చక్కటి లాంగ్ అండ్ లెంగ్త్ లో బంతిని విసురుతూ ప్రత్యర్థుల పరుగులను నియంత్రించడంలో రాటుదేలిన శ్రీ చరణి భారత్‌కు మరచిపోలేని విజయాన్ని అందించింది. శ్రీచరణి సాధించిన విజయం పట్ల ఆమె తల్లిదండ్రులే కాదు ఏపీ రాష్ట్రమే కాకుండా యావత్త్ దేశం గర్విస్తోంది.



