ఆంధ్ర ప్రదేశ్
విశాఖలో పోలీసులు తనిఖీలు.. భారీగా డ్రగ్స్ స్వాధీనం

విశాఖపట్నంలో ఈగల్ టీం, సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు అధికారులు. డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారం రావడంతో రంగంలోకి దిగిన అధికారులు గీత చరణ్, కొండారెడ్డి, హర్ష వ్దన్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 48 ఎల్ఎస్డీ బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుల్లో వైసీపీ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడుగా ఉన్నారు కొండారెడ్డి. ప్రస్తుతం వారిని అధికారులు విచారిస్తున్నారు.



